ఓ ఒంటరి మహిళకి జీవనాధారమైన హోటల్ని.. వైకాపా నాయకుడు కబ్జా చేసేందుకు బెదిరింపులకు దిగడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన మాలతి.. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించడంపై లోకేష్ స్పందించారు. మహిళలకు సీఎం జగన్ ఇచ్చే అభయం ఇదేనా అని ప్రశ్నించారు.
పిల్లలతో కలిసి మాలతి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమైందంటే.. వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఆమెను వేధించిన వైకాపా నేతని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదని.. ఆంధ్రప్రదేశ్‌ని ఆత్మహత్యల ప్రదేశ్‌గా జగన్ మార్చేశారని లోకేశ్ ఆరోపించారు. వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఆ పార్టీ నేతల అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి సంబంధించిన వీడియోను.. లోకేశ్ ట్విట్టర్‌కు జత చేశారు.
-
.@ysjagan ఆంధ్రప్రదేశ్ ని ఆత్మహత్యలప్రదేశ్ గా మార్చేసారు.వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదు.వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోతుంది.వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు.(1/3) pic.twitter.com/A7irHvCLLY
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@ysjagan ఆంధ్రప్రదేశ్ ని ఆత్మహత్యలప్రదేశ్ గా మార్చేసారు.వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదు.వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోతుంది.వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు.(1/3) pic.twitter.com/A7irHvCLLY
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 25, 2020.@ysjagan ఆంధ్రప్రదేశ్ ని ఆత్మహత్యలప్రదేశ్ గా మార్చేసారు.వైకాపా పాలనలో సామాన్యులకు రక్షణ లేదు.వైకాపా నాయకుల అరాచకాలకు అడ్డు,అదుపు లేకుండా పోతుంది.వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు.(1/3) pic.twitter.com/A7irHvCLLY
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 25, 2020
ఇదీ చదవండి:
'నా హోటల్ స్థలాన్ని వైకాపా కార్యకర్త ఆక్రమించాడు.. న్యాయం చేయండి'