ETV Bharat / state

'ముఖ్యమంత్రి జగన్ పెద్ద సైకో: నారా లోకేశ్'

వైకాపా హయాంలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ కాస్తా... సూసైడ్ ఆంధ్రప్రదేశ్​గా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

సీఎం జగన్​పై ధ్వజమెత్తిన నారా లోకేష్
author img

By

Published : Nov 22, 2019, 10:25 PM IST

'ముఖ్యమంత్రి జగన్ పెద్ద సైకో: నారా లోకేశ్'
వైఎస్ హయాంలో ఫ్యాక్షనిజం చూశామని... అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సైకోయిజం చూస్తున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా నరసారావుపేట సబ్​ జైల్లో ఉన్న రామిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ కుమ్మేత కోటిరెడ్డిని లోకేశ్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సన్​రైజ్ ఆంధ్రప్రదేశ్ కాస్తా సూసైడ్ ఆంధ్రప్రదేశ్​గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలే కొంతమంది పోలీసులు వింటున్నారని... ఫలితంగా ఆ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. మీలాగే మేము చేస్తే... మీరు పాదయాత్ర సజావుగా చేసేవారా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: 'రాజధానిపై స్పష్టతనివ్వండి'

Intro:ap_gnt_81_22_sub_jail_lo_maajee_sarpanch_ni_paramarsinchina_nara_lokesh_avb_ap10170

వైకాపా హయాంలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ కాస్తా సూసైడ్ ఆంద్రప్రదేశ్ గా మారింది. నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రం వైకాపా పాలనలో సూసైడ్ ఆంద్రప్రదేశ్ గా మారిందని నారా లోకేష్ అన్నారు. నరసరావుపేట పర్యటనకు వచ్చిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం సబ్ జైల్లో ఉన్న రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం కు చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ కుమ్మేత కోటిరెడ్డి ని కలసి పరామర్శించారు.

Body:అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాం లో జగన్ పాదయాత్ర చేసే సమయంలో పూర్తి స్థాయి భద్రత కల్పించామన్నారు. మీలాగే మేము చేస్తే మీరూ పాదయాత్ర సజావుగా చేసేవారా అని ప్రశ్నించారు. వైఎస్ హయాం లో ఫ్యాక్షనిజం చూశామని అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాం లో సైకోయిజం చూస్తున్నామని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ పెద్ద సైకో వ్యక్తిత్వం గల మనిషి అన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలే కొంతమంది పోలీసులు వింటున్నారని దీనితో పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. మన రాష్ట్ర పోలీసుల గురించి పక్కా రాష్ట్రం పోలీసులే నవ్వుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులంటే గట్టిగా వుంటారనుకుంటే వీళ్లేంటి ఇలా ఉన్నారని నవ్వుకుంటున్నారని లోకేష్ అన్నారు.

Conclusion:మేము అధికారం లో ఉన్నప్పుడు పోలీసులపై ఏ ఒత్తిడైనా చేశామా అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదన్నారు. రాష్ట్రం లో వైసీపీ వచ్చిన తరువాత ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు. పద్దెనిమిది మందిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కేసులు పెట్టేందుకు వచ్చే టీడీపీ కార్యకర్తలపై ఎదురు కేసులు బనాయించి జిల్లాల్లో పెడుతున్నారన్నారు. అదే పరిస్థితుల్లో కోటిరెడ్డి ఉన్నారన్నారు. ఎవరికీ భయపడం కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు బీజేపీ తో టచ్ లో ఉన్నారన్న సుజనా చౌదరి మాటలలో అర్ధం లేదని అవి కేవలం హడావుడి కె తప్ప ఆచరణలో ఉండవని తెలిపారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ. రిపోర్టర్
నరసరావుపేట,
9885066052.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.