గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇస్లామిక్ సేవా కమిటి మానవత్వం చాటింది. మంగళగిరి టిప్పర్ల బజార్‌కు చెందిన వాసా వాసు (50) అనే వ్యక్తి మంగళవారం అర్థరాత్రి సాధారణ అనారోగ్యంతో మృతి చెందారు.
కరోనాతో మరణించినట్లు భావించిన బంధువులు, సన్నిహితులు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. స్థానికులు ఇస్లామిక్ సేవా కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. కమిటీ సభ్యులు వెళ్లి.. వాసు మృతదేహాన్ని హిందూ శ్మశాన వాటికకు తరలించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేయించారు.
ఇదీ చూడండి: