గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చి స్థిరపడ్డ షేక్ ఖాదర్(30) చికెన్ షాపు, చికెన్ పకోడి బండి నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే రాత్రి గదిలో పడుకున్న ఖాదర్.. ఉదయానికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఖాదర్ ఒంటిపై కత్తితో గాట్లు ఉన్నాయి. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. హత్యకు అక్రమ సంబంధమే కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చూడండి:దొరకని జషిత్ ఆచూకీ...ఆందోళనలో కుటుంబం