తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులలు, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధుబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం.. ఇంతవరకు హామీని నెరవేర్చలేదన్నారు. మున్సిపల్ కార్మికులకు ఎక్కడ లేని నిబంధనలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మద్దిరాల మ్యాని అన్నారు. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని.. కార్మికులు ఎవరైనా చనిపోతే కుటుంబంలో ఒకరికి అదే పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలతో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: బాబ్రీ తీర్పు: యూపీ, దిల్లీలో హై అలర్ట్