గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘం అధికారులు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పట్టణంలోని మాంసం విక్రయించే దుకాణాలను మూసేయించారు. అన్ని సినిమా థియేటర్లను బంద్ చేశారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలను తీసుకుంటున్నారు. వారి ఇళ్లలోనే పరిశీలనలో ఉంచారు. కరోనాను ఎదుర్కోనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని రెడ్డి తెలిపారు.
కరోనా వైరస్ కట్టడికి పురపాలక సంఘం చర్యలు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు మంగళగిరి పురపాలక సంఘం అధికారులు చర్యలు చేపట్టారు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో క్రయ విక్రయాలను నిలిపివేశారు.
కరోనా నియంత్రణ పై పురపాలక సంఘం కమిషనర్
గుంటూరు జిల్లా మంగళగిరి పురపాలక సంఘం అధికారులు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పట్టణంలోని మాంసం విక్రయించే దుకాణాలను మూసేయించారు. అన్ని సినిమా థియేటర్లను బంద్ చేశారు. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలను తీసుకుంటున్నారు. వారి ఇళ్లలోనే పరిశీలనలో ఉంచారు. కరోనాను ఎదుర్కోనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:మాల్స్ ముందు బారులు తీరిన జనం