ETV Bharat / state

'తెదేపాపై కక్షతో బిల్లులు పెండింగ్ పెట్టారు' - పంచాయతీ పనుల పెండింగ్ బిల్లుల వార్తలు

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పంచాయతీల అభివృద్ధి పనుల పెండింగ్​ బిల్లులపై ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆంధ్రప్రదేశ్​ పంచాయత్ పరిషత్​ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ​ ముల్లంగి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. తెదేపాపై కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం బిల్లులు పెండింగ్​లో పెట్టిందన్నారు. ప్రభుత్వం బిల్లుల ఎగవేత యోచనలో ఉంటే తెదేపా పరిస్థితే వైకాపాకు పడుతుందని ఆయన అన్నారు.

ముల్లంగి రామకృష్ణా రెడ్డి
ముల్లంగి రామకృష్ణా రెడ్డి
author img

By

Published : Jun 9, 2020, 11:20 PM IST

Updated : Jun 10, 2020, 9:44 AM IST

గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను వైకాపా ప్రభుత్వం కావాలనే పెండింగ్​లో పెట్టిందని ఆంధ్రప్రదేశ్​ పంచాయత్​ పరిషత్​ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ముల్లంగి రామకృష్ణా రెడ్డి అన్నారు. మాజీ సర్పంచులైన తాము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. వైకాపా ప్రభుత్వం తెదేపాపై కక్ష సాధింపు ధోరణితో బిల్లులు చెల్లించడంలేదన్నారు.

బిల్లులు చెల్లించే యోచనలో ప్రభుత్వం లేదని రామకృష్ణా రెడ్డి అన్నారు. మాజీ సర్పంచులంతా కలిసి పెండింగ్​ బిల్లుల కోసం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశామన్నారు. ఈ వ్యాజ్యంపై కోర్టులో విచారణ జరుగుతుందన్నారు. పంచాయతీ అభివృద్ధి పనులు చేసేటప్పుడు అన్ని స్థాయిల అధికారులు పరిశీలించి బిల్లులు చెల్లించేందుకు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రాలేదని ఆయన చెప్పారు.

వైకాపా ప్రభుత్వం విచారణల పేరుతో కాలయాపన చేస్తుందే తప్పా బిల్లులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం బిల్లుల ఎగవేతకు పాల్పడితే...తెదేపాకు పట్టిన గతే పడుతుందన్నారు. బిల్లులు చెల్లింపులు లేక సుమారు 7 వేల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించక.. ఉన్న ఆస్తులు అమ్ముకుని, అప్పుల పాలై 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగుతామని రామకృష్ణా రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి : కాళహస్తిలో అర్చకుడికి కరోనా లక్షణాలు.. దర్శనాలు రద్దు!

Last Updated : Jun 10, 2020, 9:44 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.