ETV Bharat / state

MTech Admissions Decreasing in Andhra Pradesh: రాష్ట్రంలో తగ్గుతున్న ఎంటెక్ ప్రవేశాలు.. జగన్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమా..?

author img

By

Published : Aug 21, 2023, 7:18 AM IST

MTech Admissions Decreasing in Andhra Pradesh: రాష్ట్రంలో ఎంటెక్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావటం లేదు. గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రవేశ పరీక్ష రాసేందుకు సైతం వారు ఆసక్తి చూపించడం లేదు. కోర్సుల్లో నాణ్యతలేమి, ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని జగన్ సర్కారు నిలిపేయడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎంటెక్‌పై ఆసక్తి ఉన్నవారు ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలు, ఐఐటీ, నీట్, ట్రిపుల్ఐటీ లాంటి విద్యాసంస్థలకు ప్రాధాన్యమిస్తున్నారు. మరికొందరు బీటెక్ తర్వాత ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఎంటెక్ చేసేవారు తగ్గిపోతుండడంతో బీటెక్ కోర్సులకు అధ్యాపకుల కొరత ఏర్పడుతోంది.

MTech Admissions  Decreasing in Andhra Pradesh
MTech_admissions_decreasing_in_Andhra_Pradesh
MTech Admissions Decreasing in Andhra Pradesh: రాష్ట్రంలో తగ్గుతున్న ఎంటెక్ ప్రవేశాలు.. జగన్ సర్కార్ నిర్లక్ష్యమే కారణమా..?

MTech Admissions Decreasing in Andhra Pradesh: ఏఐని సృష్టించే వారిగా మారాలంటూ చెప్పే ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో మాత్రం కనిపించడంలేదు. పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు ఫీజుల చెల్లింపు పథకాన్ని నిలిపేస్తే ఏఐని సృష్టించే వాళ్లుగా విద్యార్థులు ఎలా తయారవుతారు? మార్కెట్లోకి వస్తున్న ఎమర్జింగ్ కోర్సులపై ఉన్నత చదువుల్లేకుండానే ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా తయారు కావడం సాధ్యమయ్యే పనేనా?

రాష్ట్రంలో ఎంటెక్​లో చేరే వారి సంఖ్య ప్రతి ఏడాది దారుణంగా పడిపోతున్నా పట్టించుకోకుండా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జి బోధన పద్ధతులు అమలు చేస్తామంటే ఏం లాభం? అసలు ప్రైవేటులో ఎంటెక్ లాంటి కోర్సులు చదివే స్తోమత లేక... ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులు బీటెక్ తోనే చదువు ఆపేస్తున్న సంగతి సీఎం జగన్‌కు తెలుసా?

No PG Admissions: ఉన్నత విద్యకు ‘ఉరి’.. పడిపోయిన పీజీ ప్రవేశాలు.. మాటలు తప్ప చేతలు చూపించని వైసీపీ సర్కారు

MTech Admissions: ఎంటెక్‌లో ఎమర్జింగ్ కోర్సులు ప్రైవేటు కళాశాలల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో.. చేరితే ప్రభుత్వం ఫీజులు ఇవ్వటం లేదు. 2020-21 విద్యాసంవత్సరం నుంచే పీజీ కోర్సులకు బోధనా రుసుములు చెల్లింపును నిలిపేసింది. పేదలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు మంచి ప్రైవేటు కళాశాలల్లో చదవాలంటే ఖర్చు సొంతంగానే భరించాల్సి వస్తోంది. సాధారణంగా ఉపాధి అవకాశాలున్న కోర్సులవైపే విద్యార్థులు మొగ్గు చూపుతారు తప్ప.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఫీజు రీయంబర్స్మెంటు వస్తుందని వాటిల్లో చేరరు అనే విషయం అందరికి తెలిసిందే.. అందుకే ఆర్థిక భారం భరించలేని విద్యార్థులు ఎంటెక్‌కు వెళ్లలేకపోతున్నారు.

MTech Admissions: ప్రైవేట్‌ విద్యాసంస్థలకు 2019-20 వరకు చెల్లించాల్సిన 450 కోట్ల రూపాయల బకాయిలు ఇవ్వలేదు. వాటిని ఇవ్వాలని నాలుగేళ్లుగా యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇటీవల వారిపై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం 75 శాతం మాత్రమే చెల్లిస్తామని మెలికపెట్టి అంగీకరించాలంటూ ఆదేశించింది. వచ్చిందే చాలనుకుని యాజమాన్యాలు అంగీకార పత్రాలను సమర్పించాయి. ఇప్పటికి మూడునెలలు గడిచినా బకాయిలివ్వలేదు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు చాలా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. కొంతమంది ఆ డబ్బు చెల్లించి ధ్రువపత్రాలు తీసుకోగా.. మరికొంతమంది డబ్బు చెల్లించలేక వదిలేశారు.

AP Higher Education Counseling ఉన్నత విద్యామండలికి నిర్లక్ష్య వైఖరి ఎలా? విద్యార్థులకు పరీక్షా కాలం..!

స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగకపోవడం, కోర్సుల్లో నాణ్యత లోపించడంతో రాష్ట్రంలో ఇంజినీరింగ్ తర్వాత ఎంటెక్లో చేరేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆసక్తి ఉన్నవారేమో విదేశాలు, జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. విదేశాల్లో M.S కు వెళ్తున్న విద్యార్థులు ఏటా 25 వేల వరకు ఉంటే.. రాష్ట్రంలో ఎంటెక్లో చేరుతున్న వారు ఈ నాలుగేళ్లలో సరాసరిన 8 వేలలోపే ఉన్నారు. అమెరికాకు వెళ్లే వారే 15 వేలకు పైగా ఉంటారని అంచనాలు ఉన్నాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాలకు వెళ్లే వారు మరో 10 వేల వరకు ఉంటారు.

రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఎంటెక్‌ ప్రవేశాలను గమనిస్తే.. 2019-20 లో 12,892 మంది 2020-21 లో 7,625 మంది, 2021-22 లో 6,063 మంది, 2022-23లో కేవలం 5,271 మంది విద్యార్థులు మాత్రమే ఎంటెక్‌ చేరారు. ఎంటెక్ చేసే వారు తగ్గిపోవడంతో ఇంజినీరింగ్​లో కంప్యూటర్ సైన్స్, ఇతర ఎమర్జింగ్ కోర్సులను బోధించేందుకు అధ్యాపకుల కొరత ఏర్పడింది. పీజీ చేసినా అదనంగా జీతాలొచ్చే పరిస్థితి లేదు. దీంతో చాలామంది బీటెక్‌తోనే ఆగిపోతున్నారు.

Education Migrants: ఉన్నత విద్యను గాలికొదిలేసిన ప్రభుత్వం.. పైచదువుల కోసం పొరుగురాష్ట్రాల బాటలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.