ETV Bharat / state

విద్యుత్ మీటర్లు పంపిణీ చేయాలని ఆందోళన

గుంటూరు జిల్లా పొన్నూరులో విద్యుత్​ మీటర్ల కోసం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. తక్షణమే విద్యుత్​ మీటర్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు.

mrps leaders protests APSPDCL at ponnaru guntur district
author img

By

Published : Aug 5, 2019, 4:46 PM IST

విద్యుత్ మీటర్లు పంపిణీ చేయాలని ఆందోళన

గుంటూరు జిల్లాలోని పొన్నూరు విద్యుత్ భవన్​ను ఎమ్మార్పీఎస్ నాయకులు ముట్టడించారు. డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు రూరల్ మండలం ఓబుల్నాయుడుపాలెంలోని చర్మకారులకు విద్యుత్ మీటర్లను.. తక్షణమే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పరిశపోగు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాల నుంచి చర్మకారులు అక్కడ నివాసం ఉంటున్నా.. అధికారులు వారికి మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. కలెక్టర్ విద్యుత్ మీటర్లు విడుదల చేసినా... విద్యుత్శాఖ సిబ్బంది తమకు మీటర్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నివాసం ఉంటున్న కాలనీలో తక్షణమే విద్యుత్ మీటర్లను పంపిణీ చేయాలని, లేకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచూడండి.రేపు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్

Intro:సాధారణంగా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు జిల్లా కేంద్రాలకు వచ్చే సంస్కృతికి స్వస్తి చెప్పి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించే విధంగా జిల్లా పాలనాధికారి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ స్వామి అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా నేతృత్వంలో జరిగిన స్పందన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ పరమైన ప్రక్షాళన జరిగినప్పుడే ప్రజలందరికీ తగిన న్యాయం జరుగుతుందని అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

Body:ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు ఇచ్చే వినతులను అశ్రద్ధ చేయొద్దు అని, సమస్యల సకాలంలో పరిష్కరించి ప్రజలకు న్యాయం చేద్దామని పాలనాధికారి వివిధ శాఖ అధికారులను కోరారు. ప్రజల నుండి సమస్యలు నేరుగా తెలుసుకొని వారి అర్జీలను అందుకుని పరిశీలించారు.

Conclusion:అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు అందజేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ స్వామి తెలియజేశారు . మహేంద్ర etv bharat జి డి నెల్లూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.