పీటర్ నివేదిక ఆధారంగా చేసుకుని మంత్రి బొత్స... రాజధాని గురించి ఎలా మాట్లాడతారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్య వెనుక షర్మిల, జగన్, విజయమ్మ పాత్ర ఉందని గతంలో బొత్స చేసిన ప్రకటనలు ప్రజలింకా మర్చిపోలేదని విమర్శించారు. వైఎస్ మరణం వెనుక కుటుంబ సభ్యుల పాత్రపై విచారణ జరపాలని గతంలో బొత్స డిమాండ్ చేయడం వాస్తవం కాదా అని వ్యాఖ్యానించారు. తమ వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టి అసమర్థతను ఎక్కువ కాలం కప్పిపుచ్చలేరన్న ఆయన... వ్యక్తిగత విమర్శలు మాని చేతనైతే అసెంబ్లీ వేదికగా అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్... దిల్లీ వెళ్లి తన మెడలు వంచుతూ ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూాడా చదవండి: