దిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామని దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు స్పష్టం చేశారు. వారితో కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులైన వలస కూలీలకు గుంటూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన సందర్శించారు. వారికి అల్పాహారం, దుప్పట్లు పంపిణీ చేసి, స్వీయ క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించాలని సూచించారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 2 వేల 600 మందిని క్వారంటైన్ కేంద్రాలకు పంపించామని ఐజీ వెల్లడించారు. ఇంకా చిరునామాలు దొరకని 85 మంది కోసం గాలిస్తున్నామన్నారు. కుటుంబం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా వీళ్లు ఎక్కడ ఉన్నా క్వారంటైన్ కేంద్రాలకు రావాలని ఐజీ విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి