గుంటూరు లక్ష్మీపురం కమలేష్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న మనోజ్ఞ(29) ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ముందుగా తన 9 నెలల పాపను భవనం పైనుంచి కిందకు నెట్టేసింది... ఆపై ఆమె దూకేసింది. చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా.. తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలిసిన పట్టాభిపురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: డిజిటల్ వేదికగా అవార్డులు అందుకున్న క్రీడాకారులు