ETV Bharat / state

ప్రియుడిపై మోజుతో.. కన్న పిల్లలపై కర్కశం - guntur crime news

గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి కన్న పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తోంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను పోలీసులకు అప్పగించారు.

కుమారుని వీపుపై గాయాలు, కొట్టడానికి ఉపయోగించిన మేకుల కర్ర

author img

By

Published : Oct 28, 2020, 10:36 AM IST

ప్రియుడి మోజులో పడి కన్నపిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్న తల్లి ఉదంతమిది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఓ వివాహిత.. భర్తను వదిలిపెట్టి శ్రీను అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. తన మాట వినటం లేదని, ప్రియుడితో ఏకాంతంగా గడపనీయకుండా ఆటంకం కల్పిస్తున్నారన్న ఆగ్రహంతో తన ఎనిమిదేళ్లలోపు కుమారుడు, కుమార్తెలను మేకుల కర్రతో విచక్షణరహితంగా కొట్టి హింసిస్తోంది.

మంగళవారం మరోసారి పిల్లలను కొట్టి ఇంటి నుంచి గెంటివేస్తుండగా స్థానికులు గమనించి వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు మరకా జ్యోతికి సమాచారమిచ్చారు. ఆమె ఇంటి వద్దకు వచ్చేసరికి వివాహిత పారిపోయేందుకు ప్రయత్నించింది. ఆమెను స్టేషన్‌లో అప్పగించారు.

ఇదీచదవండి

రైతులకు బేడీలు... ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.