ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని... ఎమ్మెల్సీ రామకృష్ణ పేర్కొన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బృందావన్ గార్డెన్స్ నుంచి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి.. ఈనెల 22న నామినేషన్ వేస్తానని రామకృష్ణ వెల్లడించారు.
'అనుభవం లేని వ్యక్తులు పోటీ చేయడం విడ్డూరంగా ఉంది' - ఎమ్మెల్సీ రామకృష్ణ తాజా వార్తలు
కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు పోటీ చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని... ఎమ్మెల్సీ రామకృష్ణ పేర్కొన్నారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తిలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బృందావన్ గార్డెన్స్ నుంచి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి.. ఈనెల 22న నామినేషన్ వేస్తానని రామకృష్ణ వెల్లడించారు.
ఇదీ చదవండి:
'ఆయిల్ కంపెనీలు చమురు ధరలు తగ్గించాలి'