సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో కాంట్రాక్టు విధానం ద్వారా పనిచేసే ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరిస్తామని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గుర్తు చేశారు. ఆ హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే 800 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించాలన్నారు. 223 జీవో కారణంగా స్కూల్ అసిస్టెంట్లు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు పొందలేకపోతున్నారన్న నరసింహారెడ్డి... ఆ జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి : ఇసుక కష్టాలు తీరనున్నాయ్.. త్వరలో అమల్లోకి కొత్త పాలసీ