అమరావతిపై జగన్‌కు ఎందుకంత కక్ష అని తెదేపా ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం జోక్యం లేకుండా ఏ రాష్ట్రమైనా రాజధాని ఏర్పాటు చేసిందా అని ప్రశ్నించారు. భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాజధాని అంశంలో ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రాజధాని అమరావతేనని... వైకాపా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైకాపా విఫలమైందని అన్నారు. కేంద్రం మెడలు వంచడమంటే ఇదేనా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా వైకాపా ప్రభుత్వం హోదాపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికే ఇవ్వలేదని ఆరోపించారు. హోదా ముగిసిన అధ్యాయమని భాజపా నేతలు చెబుతుంటే వైకాపా ఎంపీలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రహస్య సమావేశాల్లో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తుల గురించి పట్టించుకోవడం లేదని... ఏపీ భవిష్యత్‌ను దిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. 'శాసనమండలి రద్దు చేయండి చాలు రాష్ట్రానికి ఏం వద్దు' అని వైకాపా ఎంపీలు అంటున్నారని విమర్శించారు.
ఇవీ చదవండి...'రాష్ట్రం రాజధాని జీవో మారిస్తే కేంద్రం ఒప్పుకుంటుంది'