ETV Bharat / state

పేకాట శిబిరం వ్యవహారంతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే శ్రీదేవి

గుంటూరు జిల్లా పెదకాకానిలో పేకాట శిబిరం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తన పేరు రావటం వెనుక కుట్ర దాగి ఉందని... దీనిపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

mla sridevi clarifies about playing cards issue in pedakakani guntur district
ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యే
author img

By

Published : Jul 30, 2020, 1:16 PM IST

గుంటూరు జిల్లా పెదకాకానిలో పేకాట శిబిరం వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. తాను పేకాట ఆడిస్తున్నట్లుగా ప్రచారం జరగటంపై ఆమె ఆగ్రహం వెలిబుచ్చారు. అసలు ఆ ప్రాంతం తన నియోజకవర్గం పరిధిలోనే లేదన్నారు. పేకాట శిబిరంపై సమగ్ర విచారణ జరపాలని ఎస్పీ, ఐజీని కలిసినట్లు తెలిపారు.

తాను 20ఏళ్లుగా వైద్యురాలిగా మంచి పేరు తెచ్చుకున్నానని... ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా కూడా చూడకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేకాట కేసులో పట్టుబడిన వారిని వదిలిపెట్టాలని తాను పోలీసులకు ఫోన్ చేయలేదన్నారు. ఈ వ్యవహారంలో తన పేరు రావటం వెనుక కుట్ర దాగి ఉందని... దీనిపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

ఇవీ చదవండి...

'కరోనా విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.