తాడికొండ ఎమ్మెల్యే, వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ని ఆయన నివాసంలో పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం సురేష్ పై జరిగిన దాడి పిరికిపంద చర్యగా భావించి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీదేవి ధైర్యాన్ని నింపారు.
ఘటన జరిగిన రోజు తాను హైదరాబాద్ లో ఉండడం వల్ల కలవలేకపోయినట్టు చెప్పారు. అదే రోజు తుళ్లూరు సీఐ, డీఎస్పీలతో మాట్లాడి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. వైకాపాలో దళితులకు సీఎం జగన్ పెద్దపీట వేశారని, ఎప్పుడూ అండగా ఉంటారని శ్రీదేవి తెలిపారు.
ఇవీ చూడండి: