ETV Bharat / state

పట్టణాభివృద్ధికి అందరం సమష్టిగా పనిచేద్దాం: ఎమ్మెల్యే రజిని - చిలకలూరుపేట పురపాలక మొదటి కౌన్సిల్ సమావేశం

చిలకలూరిపేట పురపాలక సంఘం అభివృద్ధికి అందరం కలిసి సమష్టిగా పనిచేద్దామని ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. పురపాలక కౌన్సిల్ మొదటి సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

mla rajini attend fist council meeting of chilakaluripet
చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్ మొదటి సమావేశం
author img

By

Published : Mar 30, 2021, 5:13 PM IST

చిలకలూరిపేట పురపాలక నూతన పాలకవర్గం మొదటి సమావేశం జరిగింది. ఛైర్మన్ షేక్ రఫాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో తాగునీటితో పాటు పారిశుద్ధ్య సమస్యలపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు. పట్టణంలో దివంగత నేత వైఎస్ఆర్, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల ఏర్పాటుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విడదల రజినిని.. కౌన్సిల్​ సభ్యులు సత్కరించారు. అందరూ సమష్టిగా పట్టణాభివృద్ధికి కృషిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ఏదైనా సమస్య ఉంటే తనను సంప్రదించాలన్నారు. అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీకి రావాల్సిన రూ. 82 కోట్ల నిధుల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

ఇదీ చూడండి:

ఆగస్టు 15న విలేజ్ క్లినిక్​లు ప్రారంభించాలి: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.