గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ కొవిడ్ వైద్యశాలను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పడకలు ఇవ్వడానికి, మృతదేహాలను తీసుకువెళ్లేందుకు.. బాధితుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్యశాలలో పరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చికిత్స పొందుతున్న బాధితులను వైద్యసేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అనుసరించాల్సిన విధివిధానాలపై అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్యం, వసతుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: గది ఉష్ణోగ్రత వద్ద టీకా నిల్వ- పోర్టబుల్ వెంటిలేటర్!
ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితులందరికీ మందులను ప్రభుత్వమే అందించాలని.. బయటి నుంచి ఏ ఒక్కటీ తెచ్చుకోవాల్సిన అవసరం రాకూడదని వైద్యాధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని.. రెమ్డెసివర్ మాత్రమే కొంత కొరత ఉన్నట్లు మీడియాకు తెలిపారు. సిబ్బంది తక్కువ ఉండటంతో.. కలెక్టర్ కార్యాలయంలో వైద్యులు, స్టాఫ్ నియామకం శనివారం జరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ 200 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు ఎలాంటి సమస్యలు ఏర్పడినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇదీ చదవండి: