కోటప్పకొండలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిర్వహించే తిరునాళ్ల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించారు. ప్రతి ఏటా నిర్వహించే తిరునాళ్ళ వేడుకలను ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందుకుగాను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది క్యూ లైన్లలో, అభిషేకాలు, దర్శనాలలో ఏర్పడ్డ ఇబ్బందులను గుర్తించి.. తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఏటా ట్రాఫిక్ పరంగా కలిగే ఇబ్బందులు ఈ సంవత్సరం లేకుండా రూట్ మ్యాప్ చేయాలన్నారు.
వివిధ స్వచ్చంద సేవా సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి తిరునాళ్ళ రోజున భక్తులకు పులిహోర, మజ్జిగ తదితర భోజన వసతుల పంపిణీపై త్వరలో చర్చిస్తామని గోపిరెడ్డి తెలిపారు. అదేవిధంగా అధికారులందరూ సమన్వయంతో పని చేసి తిరునాళ్లను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలు అందరూ పాటించాలన్నారు.
ఇవీ చూడండి...