వైకాపా ఏడాది పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు వైకాపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో ముంచింది చంద్రబాబు అని ఆరోపించారు. లోటు బడ్జెట్లో ఉన్నా సంక్షేమ పథకాలు ఆమలు చేస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానిదన్నారు.
వైకాపా ప్రజా సంక్షేమ పాలనపై తెదేపా నేతలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై సొంత పార్టీ నేతలకే నమ్మకం ఉండడంలేదని ఆరోపించారు. 10 మంది పైగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి సలహాలు ఇవ్వాలే తప్ప ఆరోపణలు చేయడం సరికాదని మద్దాలి గిరధర్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : విశాఖ నౌకాదళ గూఢచర్యం కేసులో కీలక సూత్రధారి అరెస్టు