మున్సిపల్ చైర్మన్ వైకాపా అభ్యర్థిగా డాక్టర్ దస్తగిరిని ఎంపిక చేయడం జరిగిందని.. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ఇప్పటివరకు త్రాగునీటి సమస్య పరిష్కారానికి చేసిన పనులు తాత్కాలికమని.. శాశ్వత తాగునీటి పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. పట్టణానికి నూతన పైపులైన్ నిర్మాణంతోపాటు దొండపాడు చెరువు నుంచి లిఫ్ట్ ద్వారా తాగునీరు సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ప్రజాక్షేత్రంలో వైకాపా విజయం సాధిస్తుందన్న అక్కసుతోనే తెదేపా తప్పుడు ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు దస్తగిరి, తులసిరెడ్డి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...