గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లో శనివారం ఒక్కరోజే 150కి పైగా కరోనా కేసులు వచ్చాయి. కొవిడ్ బాధితులు పెరుగుతుండటంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులు, పోలీసులతో సమీక్షించారు. కేసులు తగ్గించేందుకు ఇంటింటా సర్వే నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వైరస్ సోకిన వారు ఏ రకమైన అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారనే అంశాలపై సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. సోమవారం నుంచి మంగళగిరి పరిధిలో 144 సెక్షన్ అమలయ్యేలా జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రజలు మాత్రం స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. 45 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా వేయాలని తెలిపారు.
ఇదీ చదవండి: మాస్కులపై అవగాహన..పెడచెవిన పెడితే జరిమానాలేనని పోలీసుల హెచ్చరిక