గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనాథల మధ్య దీపావళి పండుగ జరుపుకున్నారు. మంగళగిరి పట్టణంలో షైన్ అనాథ ఆశ్రమంలో చిన్నారులకు పండుగ సందర్భంగా మిఠాయిలు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
చిన్నారులతో కలిసి..
అనంతరం దీపావళిని పురస్కరించుకుని చిన్నారులతో కలిసి కాకరొత్తులు కాల్చారు. జాతీయ బాలల దినోత్సవం నేపథ్యంలో చిన్నారులకు బాలల దినోత్స శుభాకాంక్షలు తెలియజేశారు. అనాథాశ్రమంలోని చిన్నారులకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.