ETV Bharat / state

మద్యం తాగించి.. హైదరాబాద్​లో బాలికపై గ్యాంగ్ రేప్ - ap crime news

Girl gang rape in Hyderabad : హైదరాబాద్​లోని పాతబస్తీ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికకు కొందరు యువకులు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేయగా.. అందులో ముగ్గురు.. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు.. మరో ఇద్దరు వారికి సహకరించినట్లు గుర్తించారు.

Girl gang rape in Hyderabad
బాలికపై గ్యాంగ్ రేప్
author img

By

Published : Feb 8, 2023, 1:38 PM IST

Girl gang rape in Hyderabad : బాలికలపై లైంగిక దాడులను అరికట్టడానికి ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకొచ్చినా.. రోజుకో చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామంధులు వారి పశువాంఛను తీర్చుకోవడానికి చిన్నపిల్లలను, అమాయకపు బాలికలను వాడుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్​లోని పాతబస్తీ ఏరియాలో కొందరు యువకులు బాలికకు మద్యం తాగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

minor Girl gang rape in Hyderabad :తెలంగాణలోని ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ బాలిక ఈనెల 4వ తేదీన మందులు కొనుగోలు చేసేందుకు తనకు తెలిసిన హోల్‌సేల్‌ ఔషధాలు విక్రయించే దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న ముగ్గురు యువకులు తక్కువ ధరకు మందులు ఇప్పిస్తామని నమ్మించి.. బాలికను కందికల్​లోని బోయిగూడలో ఓ ఇంటికి తీసుకువెళ్లారు.

ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ బాలికతో బలవంతంగా హుక్కా తాగించారు. ఆ తర్వాత కాసేపటికి శీతల పానీయంలో మద్యం కలిపి బాలిక చేత తాగించారు. అనంతరం ఆమెతో వారు అసభ్యంగా ప్రవర్తించడంతో కేకలు వేసింది. గమనించిన నిందితులు బాధితురాలి అరుపులు బయటకు వినపడకుండా మ్యూజిక్‌ సిస్టంలో సౌండ్‌ పెంచారు. దీంతో ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. బాలికపై దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత మత్తులోకి జారుకోగానే ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలికు మెలుకువ రాగానే వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకొని ఏడ్చుకుంటూ జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఇచ్చిన వివరాలతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలించారు. చివరకు ఏపీలోని గుంటూరు జిల్లాలో ఉన్నట్లు తెలుసుకున్నారు.

వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడగా.. మరో ఇద్దరు వారికి సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితులు ఐదుగురిని రిమాండ్​కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.