ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

author img

By

Published : Oct 17, 2020, 1:29 PM IST

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటిస్తున్నారు. పంటలు నష్టపోయిన రైతులతో మంత్రులు మాట్లాడారు. పంట నష్టం అంచనాల కోసం అధికారులు వస్తారని తెలిపారు.

Ministers visit flood area in Guntur District
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు మేకతోటి సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటిస్తున్నారు. చిర్రావూరు, మంగళగిరి, తెనాలి, వేమూరు నియోజకవర్గాల పరిధిలో వరద నష్టం ఎక్కువగా జరిగింది. ప్రస్తుతం చిర్రావూరు, బొమ్మువానిపాలెం, చిలమూరు, కొల్లిపొర ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. పంటలు వరద ముంపులో చిక్కుకున్న తీరుని పరిశీలించారు. వరద తీవ్రతకు ఎక్కువగా పసుపు, కంద, మినుము, అరటి, మిరప తోటలు దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయిన రైతులతో మంత్రులు మాట్లాడారు. పంట నష్టం అంచనాల కోసం అధికారులు వస్తారని తెలిపారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, రైతు సాధికార సంస్థ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఉన్నారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని వరద ప్రాంతాల్లోనూ మంత్రులు పర్యటించనున్నారు.

ఇదీ చదవండీ... నిత్యావసరమే.. అత్యవసరంగా పొదుపుచేయాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.