రేవేంద్రపాడు ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక్క ఓటు లేనప్పుడు ఇక్కడి రాజకీయాల్లో కేసీఆర్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని మంగళగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థించారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెదేపా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రేవేంద్రపాడులోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దుగ్గిరాలకు పసుపు అధ్యయన కేంద్రాన్ని తీసుకువస్తానని అన్నారు. పసుపు యార్డు ఛైర్మన్ కేశినేని శ్రీధర్ లోకేశ్‌ను పసుపు కొమ్ముల మాలతో సత్కరించారు.
ఇవీ చూడండి.
ఏపీ భవిష్యత్తును రాష్ట్ర ప్రజలే నిర్దేశించుకోవాలి:జేపీ