ETV Bharat / state

బొత్స ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు...

రాజధానిపై సీఎం జగన్​ నిర్ణయం చెప్తారని అందరూ ఎదురుచూస్తుండగా మళ్లీ మంత్రి బొత్సనే మాట్లాడారని తెదేపా నేత సోమిరెడ్డి విమర్శించారు. రాజధానిపై మంత్రి మాటలు అనువాదం చేయించినా ఎవరికీ అర్ధం కావన్నారు. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్​పై బొత్స చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

సోమిరెడ్డి
author img

By

Published : Aug 30, 2019, 5:21 PM IST

Updated : Aug 30, 2019, 7:24 PM IST

మీడియాతో సోమిరెడ్డి

రాజధాని విస్తరించిన పరిధికి, రాజధానికి తేడా తెలియని విధంగా బొత్సలాంటి సీనియర్ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెదేపా నేత సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. నిన్నటి సీఎం సీఆర్డీఏ సమీక్షలో జగన్ నిర్ణయం ఏమిటా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే.. ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రాజధానిపై బొత్స మాటలు అనువాదం చేయించినా అర్థం కావని విమర్శించారు.

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్​కు చెందిన ఓ సంస్థకు తెదేపా హయాంలో భారీగా భూ కేటాయింపులు జరిగాయని బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మండిపడ్డారు. కిరణ్​కుమార్​రెడ్డి ప్రభుత్వంలో బొత్స మంత్రిగా ఉన్నప్పుడే ఆ భూముల ఎంవోయూ జరిగిందని స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఆ సంస్థకు భూమి బదిలీ జరగలేదని.. ప్రస్తుతం ఆ భూములు ప్రభుత్వ హయాంలోనే ఉన్నాయని వెల్లడించారు. బాలకృష్ణ అల్లుడు కాబట్టి ఏదో ఒక నింద మోపాలని చూడటం తగదని హితవు పలికారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని లేకుంటే క్షమాపణలు చెప్పాలని బొత్సకు సోమిరెడ్డి సవాల్ విసిరారు.

Intro:ap_atp_52_30_maji_minister_sunitha_press_meet_avb_ap10094

Body:ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ రంగాన్ని మరియు కార్మికుల ఉపాధిని వ్యాపారాలను దెబ్బతీసే విధంగా నిర్ణయం తీసుకున్నందున అలాంటి నిర్ణయాలను రద్దు చేసి రాష్ట్రంలో ప్రజలకు పూర్తి స్థాయిలో అందించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ విలేకరుల సమావేశం నిర్వహించారు.

Conclusion:R.Ganesh
RPD(ATP)
cell: 9440130913
Last Updated : Aug 30, 2019, 7:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.