ETV Bharat / state

సహజ అందాలతో మనసును దోచేస్తున్న మడఅడవులు - సహజ అందాలతో మనసును దోచేస్తున్న మడఅడవులు

నదీమతల్లి పరవళ్లు. సముద్రుని సోయగాలు. పచ్చని ప్రకృతి అందాలు... పక్షుల కిలకిలలు. ఎర్రపీతల ఆటలు. వీటన్నింటి సమాహారమే మడ అడవులు. సంద్రానికి ఆకుపచ్చ అంచులా, విభిన్నమైన జీవావరణానికి వేదికలా.. దర్శనమిస్తాయి. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ విభిన్నమైన వృక్ష, జీవజాతుల సమూహం మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తాయి. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ సమీపంలోని మడ అడవుల చూడచక్కని అందాలు చూసొద్దాం రండి.

మడఅడవులు
మడఅడవులు
author img

By

Published : Nov 1, 2021, 9:41 AM IST

సహజ అందాలతో మనసును దోచేస్తున్న మడఅడవులు

మదిని దోచే సుందర దృశ్యాలు... పరవశింపజేసే వాతావరణం. మనసును ఉయ్యాలలూపే ప్రకృతి అందాలు. ఇవే మడఅడవుల సమహారం. సముద్రుడు. ఆకాశాన్ని నేలను కలిపినట్లు, మడ అడవులు. నదీతీరాన్ని ఆ సముద్రుడితో కలుపుతాయి. వీటి మధ్యలో పడవ ప్రయాణం.... చెప్తుంటేనే ఆహా అనిపిస్తోంది కదూ..! ఆ అందాలు చూస్తూ ముందుకు వెళ్తుంటే జీవితంలో మధుర క్షణాలివే అనుకోవటం ఖాయం. ఇక్కడ వెండిపల్లెంలా మెరిసే నీటి అందాల్ని, ఆ నీటిపైనే ఆధారపడే మత్స్యకారుల జీవనశైలిని దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది.

ఈ మడ అడవుల ప్రాంతంలో కనిపించే అరుదైన జీవజాతుల్లో ఎర్రపీతలు ఒకటి. ఇవి మనుషుల్ని చూడగానే దూరంగా పరిగెడుతాయి. చెప్పాలంటే వీటికి కొంచెం సిగ్గెక్కువన్నమాట. ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఇవి తినేందుకు పనికిరావు.

నానాటికి తరిగిపోతున్న జీవవైవిధ్యాన్ని ఈ మడఅడవులు సంరక్షిస్తున్నాయి. ఎంతో వైవిధ్యభరితమైన జీవరాశులకు ఇవి ఆటపట్టుగా ఉంటాయి. వలసపక్షులు గూళ్ళు కట్టుకునేందుకు, సముద్రజీవుల సంతానోత్పత్తికి ఈ అడవులు అనువుగా ఉంటాయి. నీటిలోని మాలిన్యాలను, హాని కలిగించే భారలోహాలను శోషించుకుని నీటిని శుద్ధి చేస్తాయి. అలాగే గాలిలోని కాలుష్యాలను శోషించుకుని గాలిని కూడా శుద్ధి చేస్తాయి. అంతేకాదు ఈ అడవులు కలప, వంటచెరకు, పశుగ్రాసం లభించే కేంద్రాలుగా ఉంటాయి. ఇవి సముద్ర తీర ప్రాంతాల్లో జీవించే మత్స్యకారుల కుటుంబాల సంపాదనకు ఆధారంగా ఉంటున్నాయి.
మనకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలు కలిగిస్తున్న ఈ మడ అడవులు అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం ఏర్పాటు చేయటంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి పర్యాటక కేంద్రంగా మారుతోందని.. స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: JAYANJTHI: గుంటూరులో పాటిబండ్ల సీతారామయ్య 139వ జయంత్యోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.