ఎగువ ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రావడం వల్ల... జలాశయం మరోసారి నిండుకుండను తలపిస్తోంది. కృష్ణా జిల్లాలో వరద ప్రవాహాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. వరద తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీచూడండి: