రాజధాని అంశంపై వైకాపా ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తమ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌ను ఒక్క వైకాపా నేత స్వీకరించలేదని గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా నేతలు అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల శాసనసభ్యులు రాజీనామా చేసి గెలిస్తే చాలన్నారు. మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లే ధైర్యం వైకాపా ప్రభుత్వానికి లేదన్నారు.
ఇవీ చదవండి..