ETV Bharat / state

నకిలీ డాక్యుమెంట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు... 13 కేసులు నమోదు

author img

By

Published : Jul 7, 2021, 9:34 PM IST

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి... స్థలాలను విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.40,000 నగదు, ఆరు బంగారు ఉంగరాలు, ఖాళీ నాన్ జ్యూడీషియల్ డాక్యుమెంట్లు, రబ్బర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులపై 13 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో 17 మంది పాత్ర ఉందని.. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

gang arrest
ముఠా అరెస్ట్

అసైన్డ్ భూములకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి... స్థలాలను విక్రయించే ముఠాను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి రత్నాల చెరువులో ప్రభుత్వం కొంతమంది పేదలకు గతంలో పట్టాలిచ్చింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఖాళీ స్థలాలకు పాత తేదీలతో ఉన్న డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది విక్రయిస్తున్నట్ల దర్యాప్తులో తేలిందని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసి రూ.నలభై వేల నగదు, ఆరు బంగారు ఉంగరాలు, ఖాళీ నాన్ జ్యూడిషియల్ డాక్యుమెంట్స్, రబ్బర్ స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు, నాగరాజులు డబ్బులు అవసరమైనప్పుడు ఖాళీ స్థలాలను గుర్తించి వాటికి అవసరమైన స్టాంఫ్ పేపర్లను విజయవాడకు చెందిన వక్కలగడ్డ విటల్ వద్ద పాత తేదీలతో కొనుగోలు చేస్తురని పోలీసులు తెలిపారు. కొనుగోలు చేసిన స్టాంఫ్ పేపర్లపై ఇతరుల పేర్లతో నకిలీ లింక్ డాక్యుమెంట్లు తయారు చేస్తారని... వాటిని కొనుగోలు దారులకు చూపించి విక్రయిస్తారన్నారు. అసలు డాక్యుమెంట్లే ఉండని స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విక్రియిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు.

ఇప్పటివరకూ రూ.92,90,000 వరకూ క్రయవిక్రయాలు చేసినట్లు గుర్తించమన్నారు. భాదితులు ఫిర్యాదుతో ఇప్పటివరకు పదమూడు కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. నలుగురు నిందితుల పైన 120బి, 409,471,268 సెక్షన్లు కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో మరో 17 మంది పాత్ర ఉందని వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు.

ఇదీ చదవండి:

PAC Meeting: 'వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.