ETV Bharat / state

దారుణ హత్య: మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై కొంత దూరం ఈడ్చుకెళ్లి..? - ఈరోజు గుంటూరు జిల్లా క్రైమ్ తాజా వార్తలు

నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ శివారులో ఒక వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయటం కలకలం రేపింది. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న వెంకటగిరి నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఫోన్ రావటంతో బయటకు వెళ్లిన వ్యక్తి అనంతరం బావిలో శవమై కనిపించాడు. దీంతో పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణం చేపట్టారు.

man suspected death
వ్యక్తి దారుణ హత్య
author img

By

Published : Dec 10, 2020, 9:11 AM IST

గుంటూరు జిల్లా నరసరావుపేటలో నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి బావిలో శవమయ్యాడు. గత శనివారం రాత్రి ఫోన్ రావటంతో బయటకు వెళ్లిన వ్యక్తి.. తిరిగి ఇంటికి రాలేదు. తాపీ మేస్త్రిగా పని చేస్తున్న వెంకటగిరి రెండు రోజులైన రాకపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం జొన్నలగడ్డ గ్రామ శివారులో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వెనుక బావిలో శవమై ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించి, పరిశీలించారు. దుండగులు హత్య చేసి మృతదేహానికి తాడు కట్టి ద్విచక్ర వాహనంతో కొంతదూరం ఈడ్చుకు వెళ్లి అనంతరం వాహనంతో సహా బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం తీవ్రమైన దుర్వాసన రావటంతో ఘటన గత నాలుగురోజులు క్రితమే జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

మృతుడు మొదటి భార్యతో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకున్నాడని.. ప్రస్తుతం ఆరేళ్ళ పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్య ఎవరు చేశారనే విషయాన్ని ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అచ్చయ్య వివరించారు.

ఇవీ చూడండి...

'దాడి చేసింది ఎవరో తెలియదు.. పేర్లు ఎలా రాయాలి..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.