గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో కొంతమంది యువకులు కరప్ప అనే వ్యక్తిపై దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారు నల్లపాడుకు చెందినవారని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం:
పేరేచర్ల శివారు కొండ ప్రాంతంలో కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు. ఆరవ మైలుకు చెందిన కరప్ప అక్కడకు వెళ్లాడు. ఉన్నట్టుండి యువకులు అతనిపై దాడి చేసి, గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాదితుడిని చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: భగ్గుమన్న కుటుంబ కలహాలు... వియ్యంకులపై దాడి..