Fake IAS: ఐఏఎస్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీ ఆస్పత్రి ఎండీకి.. నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ చేసి.. తమ సంబంధిత వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోతే.. ఆస్పత్రి సీజ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆస్పత్రి మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. శ్రీనివాసరావు గతంలో సినీ పరిశ్రమలో మేనేజర్‌గా పనిచేశారు.
ఇదీ చదవండి:
జగన్ రెడ్డికి 'అస్కార్' కాదు.. 'మోసకార్ అవార్డు' ఇవ్వాల్సిందే - అచ్చెన్న