ETV Bharat / state

ఘనంగా శివరాత్రి.. శివనామస్మరణతో మార్మోగిన అమరావతి - ఘనంగా శివరాత్రి మహోత్సవాలు

గుంటూరు జిల్లా పంచారామక్షేత్రం అమరావతి.. శివనామ స్మరణతో మార్మోగుతోంది. వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివస్తూ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

mahashivarathri celebrations at guntur district
ఘనంగా శివరాత్రి మహోత్సవాలు
author img

By

Published : Mar 11, 2021, 1:51 PM IST

Updated : Mar 11, 2021, 6:06 PM IST

పంచారామక్షేత్రం అమరావతి.. శివనామ స్మరణతో మార్మోగుతోంది. మహా శివరాత్రి పర్వదినాన అమరలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివయ్య చల్లగా కాపాడాలంటూ ప్రార్థించారు. మొక్కులు చెల్లించారు. గుంటూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయం పక్కనే కృష్ణా నదిలో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని అమర్తులూరు మండలంలో వెలసిన బాలకోటేశ్వరస్వామి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. 120 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో బి.అశోక్ కుమార్ తెలిపారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం 4 ఆర్టీసీ డిపోల నుంచి దాదాపుగా 70 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. గర్భగుడిలో దంపతులకు ప్రత్యేకంగా రూ.2వేలతో దివ్యదర్శనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు.

పత్తిపాడు నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదినాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పెదనందిపాడులో సోమేశ్వరస్వామి ఆలయంలో మహిళలు కలశాలు తీసుకుని.. గ్రామంలో ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయంలో కలశ పూజ చేసి.. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి కళ్యాణంతో పాటు లింగోద్భవ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు.

మెడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో కొలువై ఉన్న కైలాస గిరి క్షేత్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో అంగరంగా వైభవంగా జరిగాయి. ఉదయం అష్టోత్తర శతనామావళి, బిల్వార్చన, కుంకుమ పూజ అభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేశారు. కైలాస నాధున్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకల్లో తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి, ఆమె భర్త కమ్మెల శ్రీధర్ స్వామివారిని దర్శించుకుని పాలాభిషేకం చేశారు. తాడికొండ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా.. ఇతర రూపాలు లేవా?

Last Updated : Mar 11, 2021, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.