MP CM Shivraj Singh Chauhan Allegations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి Daggubati Purandheswari జాతీయ జెండాను ఆవిష్కరించారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారికి నివాళులర్పించారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం అని పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఆ విలువలను నిల బెట్టాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని అన్నారు. భావి తరాల వారికి కూడా వారి త్యాగాలను తెలియ చేయాలన్నారు.
మన దేశంలో ఉన్న శాంతియుత వాతావరణం ఏ దేశంలో లేదన్న పురంధరేశ్వరి..., అనాదిగా వస్తున్న హైందవ విధానాలు ప్రధాన కారణమన్నారు. అన్ని వర్గాల వారిని అభివృద్ధి పథంలో నడిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి పెద్ద పీట వేస్తూ కేంద్రం సంక్షేమం అభివృద్ధి చేసిందన్న ఆమె..., సౌభాతృత్వ భావనతో మనందరం ముందడుగు వేయాలని దగ్గుబాటి పురంధరేశ్వరి ఆకాంక్షించారు. మోదీ హయాంలో భారతదేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. భావితరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టే కార్యక్రమాల ద్వారా భారతదేశం మరింత ప్రగతి సాధిస్తుందన్నారు.
ఇదే సందర్భంలో మధ్యప్రదేశ్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న మద్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ (AP Govt Volunteer System) అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు ఇస్తే.. వారు పార్టీ కోసమే పని చేస్తారని.. ప్రజా సంక్షేమం కోసం పని చేయారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు అందిస్తోన్న సామాజిక పింఛన్లు పారదర్శకంగా ఉంటేనే.. ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని శివరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా పాల్గొన్నారు.
గతంలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సైతం ఆరోపణలు: ఇప్పటికే పవన్ కల్యణ్ సైతం వాలంటీర్ వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో పవన్‌పై వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యప్తంగా పవన్ కల్యణ్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయనే చెప్పవచ్చు.