ETV Bharat / state

LULU Lands in AP: ‘లులు’ను తరిమేశారు.. వీళ్లు మేసేశారు!.. ఆ స్థలాల్లో ఎల్‌ఎల్‌పీ సంస్థల నిర్మాణాలు - LULU land scam in ap

YCP Leaders Constructions in Space Allotted For LULU: విశాఖలో లులు సంస్థకు కేటాయించిన విలువైన స్థలాలు వైఎస్సార్​సీపీ నేత సన్నిహితుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. విశాఖ వాసులకు ఉపాధి కల్పించాల్సి ఉన్న సంస్థను తరిమేసినా.. దానికి కేటాయించిన స్థలంలో మాత్రం పాగా వేశారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చిన విలువైన స్థలాలు వెనక్కి తీసుకోకుండా ఉంటామంటూ బేరం కుదుర్చుకున్నారు. అప్పటి ప్రభుత్వం ఆ భూములకు కల్పించిన రాయితీలను సైతం దర్జాగా అనుభవిస్తున్నారు.

lulu
lulu
author img

By

Published : Jun 29, 2023, 8:33 AM IST

‘లులు’ను తరిమేశారు.. వీళ్లు మేసేశారు!.. లులు స్థలాల్లో ఎల్‌ఎల్‌పీ సంస్థల నిర్మాణాలు

YCP Leaders Construction in Space Allotted For LULU: రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏమీ తీసుకురాకపోగా.. ఉన్న ప్రాజెక్ట్‌లను సైతం వైఎస్సార్​సీపీ సర్కార్ తరిమేసింది. విశాఖ నుంచి లులు సంస్థను వెళ్లగొట్టగా.. నాటి ప్రభుత్వం ఆ సంస్థకు ఇచ్చిన స్థలంలో ఇప్పుడు అధికారపార్టీ నాయకుల సన్నిహితులు భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. లులు సంస్థ కోసం స్థలం ఇచ్చిన యజమానులకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, పన్ను మినిహాయింపులను ఎంచక్కా తెరవెనక ఉండి వైఎస్సార్​సీపీ పెద్దలు వినియోగించుకుంటున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్రలో కీలకంగా వ్యవహరించిన వైఎస్సార్​సీపీ ఎంపీ ఒకరి ఆశీస్సులతో ఏర్పాటైన నాలుగు పరిమిత బాధ్యత భాగస్వామ్యం గల సంస్థలు ఈ నిర్మాణాలు చేపడుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ‘లులు’తో ఎంవోయూ కుదిరింది. వైజాగ్​లో లులు కన్వెన్షన్‌ సెంటర్‌ కోసం పోర్టు బంగళా ఎదుట 9.12 ఎకరాల ఏపీఐఐసీ స్థలం కేటాయించారు. అది సరిపోదని ఆ సంస్థ తెలపగా పక్కనే ఉన్న CMR గ్రూపునకు చెందిన విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌ స్థలం 3.4 ఎకరాలను ఇచ్చేందుకు నిర్ణయించారు. ఎకరా స్థలం ఇచ్చినందుకు.. మరోచోట ఎకరంన్నర స్థలం బదలాయించేలా ప్రభుత్వం జీవో-5 జారీ చేసింది. అలా నగరంలోని 6 ప్రాంతాల్లో 4.85 ఎకరాలు.. సీఎంఆర్‌ గ్రూపునకు కేటాయించారు.

సిరిపురంలోని HSBC పక్కన ఉన్న వుడా స్థలం 1.36 ఎకరాలు, చినవాల్తేరులో 4 వేల 404 గజాలు, కిర్లంపూడి లే-అవుట్‌లో 15 వందల 97 గజాలు, ఎంవీపీ కాలనీ రైతు బజారు వద్ద 7 వేల 212 గజాలు, రేసవానిపాలెంలో 3 వేల 146 చదరపు గజాలు, చినవాల్తేరు లాసన్స్‌ బే కాలనీలో 532 గజాలు.. ఇలా మొత్తం 23 వేల 473 గజాలు కేటాయించారు. ప్రస్తుతం ఈ 6 స్థలాల విలువ సుమారు రూ.వెయ్యి కోట్ల పైమాటే. వైసీపీ అధికారంలోకి రాగానే ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరుతో 'లులు'తో ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఆ సంస్థ షాపింగ్‌ మాల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణాలు కాదనుకుని విశాఖను వదిలి వెళ్లిపోయింది.

లులుకు కేటాయించిన దానిలోని 3.4 ఎకరాల విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌ ప్రైవేటు స్థలం ప్రస్తుతం వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండగా, ఫంక్షన్‌హాల్‌కు బదలాయించిన ప్రభుత్వ స్థలాలు సదరు యాజమాన్యం చేతుల్లోనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో కీలకంగా వ్యవహరించిన ఓ ఎంపీ రంగంలోకి దిగి CMR గ్రూప్ యాజమాన్యాన్ని బెదిరించారు. విశ్వప్రియ ఫంక్షన్‌ హాల్‌కు బదలాయించిన ప్రభుత్వ స్థలాలను వెనక్కి తీసుకోకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలని ఎంపీ అన్నట్లు సమాచారం.

ఉత్తరాంధ్రలో ఒకప్పుడు చక్రం తిప్పిన ఆ ఎంపీ.. అప్పట్లో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీనిలో విశాఖలోని వ్యాపారులు, రియల్టర్లు, ప్రముఖులు సభ్యులుగా చేర్చి వారి నుంచి భారీగా విరాళాలు సేకరించారు. వారిలో కొందరిని విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌కు ఇచ్చిన ప్రభుత్వ స్థలాల్లో L.L.P. సంస్థలుగా పాగా వేయించారు. వాస్తవానికి విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌ సీఎంఆర్‌ గ్రూపునకు చెందినది. లులు ఒప్పందం రద్దు చేయగానే, టీడీపీ ప్రభుత్వం బదలాయించిన స్థలాలు వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు ఎంపీ సూచించిన ఎల్‌ఎల్‌పీ సంస్థలను భాగస్వామ్యం చేయాలన్న నిబంధన పెట్టినట్లు ఆరోపణలున్నాయి. మావూరి, కంకటాల, కర్లాన్‌, లాన్‌సమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేరుతో ఎల్‌ఎల్‌పీ సంస్థలు ఏర్పాటు చేసి విలువైన స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభించారు. మెయిన్​ ఎల్‌ఎల్‌పీగా ఉన్న కర్లాన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కేరాఫ్‌ అడ్రస్‌ ఆ ఎంపీ ఫౌండేషన్‌ కార్యాలయాన్నే చూపిస్తుండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది.

విశాఖ వాసులకు ఉపాధి కల్పించాల్సిన లులు సంస్థ వెళ్లిపోయినా.. దానికి కేటాయించిన స్థలాల్లో మాత్రం.. వైఎస్సార్​సీపీ సన్నిహితులు భారీ భవన నిర్మాణాలు చేపడుతున్నారు. వాణిజ్య, నివాసయోగ్యమైన భారీ అంతస్తుల భవనాలు నిర్మించి అమ్ముకునేందుకు అడుగులు వేస్తున్నారు. లులు సంస్థ నెలకొల్పలేదు కానీ, అప్పుడు భూమార్పిడి సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు మాఫీ, 25శాతం సెట్‌ బ్యాక్‌ మినహాయింపులు, ఈ స్థలంలో వాణిజ్య, నివాసయోగ్య నిర్మాణాలు అమ్ముకోగా వచ్చిన లాభాల్లో ఆదాయపన్ను మినహాయింపు, వుడా మాస్టర్‌ ప్లాన్‌లో ఈ స్థలాల్లో భూసేకరణ జరగకుండా ఇచ్చిన మినహాయింపులు మాత్రం వైఎస్సార్​సీపీ సన్నిహితులు అందుకున్నారు. ‘లులు’తో ఒప్పంద సమయంలో అప్పటి ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్​సీపీ.. ‘నారా లోకేశ్‌కు క్విడ్‌ ప్రోకో ఉండటం వల్ల విశాఖ ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతున్నారని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ.. ఈ వ్యవహారాలను ఎలా సమర్థించుకుంటారోనని విశాఖ వాసులు అనుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.