ఆర్థిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నరసరావుపేటలోని వెంగళరెడ్డి కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
రెండో పట్టణ ఎస్సై రబ్బానీ తెలిపిన వివరాల మేరకు... వెంగళరెడ్డి కాలనీకి చెందిన షేక్ గౌస్ హుస్సేన్.. ఆర్థిక బాధలు తట్టుకోలేక ఉరి వేసుకున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా ప్రభావంతో పనిలేక బాధలు పెరిగినట్టు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: