యాసిడ్ లారీ బోల్తా- తప్పిన ప్రమాదం - నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని పెట్లూరివారిపాలెం వద్ద యాసిడ్ లారీ బోల్తా పడింది. ఈ ఘటన నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో పరిసరాల్లో ఎవరూ లేనందున పెనుముప్పు తప్పింది. యాసిడ్ లారీ బోల్తాతో కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిలో పొగ అలుముకుంది.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామ శివారులో యాసిడ్ లారీ బోల్తా పడిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Body:కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిపై కర్నూలు నుండి విశాఖపట్నం యాసిడ్ లోడ్ తో వెళ్తున్న టాంకర్ అదుపుతప్పి ప్రధాన రోడ్డు ప్రక్కకు బోల్తా కొట్టింది. దీనితో టాంకర్ లో నున్న యాసిడ్ బయటకు వచ్చి దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. సమయానికి ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. Conclusion:విషయం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి జాగ్రత్తలు చేపట్టారు. ఘటనలో లారీ డ్రైవర్ ఎటువంటి ప్రమాదం జరగకుండా బయట పడ్డాడు.