ఇసుక వారోత్సవాలు అని ముఖ్యమంత్రి జగన్ అంటే ప్రజలకు ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జగన్ అన్నది ఇసుక 'వార్' ఉత్సవాలు అని తరువాత అర్థమైందని ఎద్దేవా చేశారు. ఇసుక వార్‌లో భాగంగా వాటాల కోసం గుంటూరు జిల్లాలో వైకాపా నాయకులు కర్రలతో దాడులు చేసుకుని, తలలు పగులగొట్టుకుంటున్నారంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యంతో గుంటూరు జిల్లా పెదకాకానిలో మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయతీలు ఆపి కార్మికులకు బతుకు భరోసా ఇవ్వాలని ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి..