బందరు పోర్టు అంశంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ట్విట్టర్లో స్పందించారు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు... రేపు పాలన చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసిఆర్ చేతుల్లో పెడతారా అని ధ్వజమెత్తారు. అసమర్థులు.. ఒక్క ఛాన్స్ అంటూ ఎందుకు అడిగారు.. దోచుకోడానికా ? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానికా ? అని ప్రశ్నించారు.
![lokesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3976979_lokesh.png)