మంగళగిరి నియోజకవర్గంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. పెనుమాకలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల ముందు ఓ మాట చెప్పి.. ఇప్పుడు మరోలా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెదేపా హయంలో ట్రాక్టర్ ఇసుక ధర రూ. 1400 ఉంటే... ఇప్పుడు రూ. 10 వేలకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని నిలదీశారు. ఏ రాష్ట్రంలోనూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదని.. ఏపీలోనే ఈ సమస్య ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇసుక పాలసీ అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. వాలంటీర్లకు జీతాలు పెంచారు.. పింఛను మాత్రం తగ్గించారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: