ETV Bharat / state

అధికారం అండతో చేసే అరాచకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు: లోకేశ్​ - ఏలూరులో వైసీపీ నేతల దాడి

LOKESH CONDEMNED THE ATTACK ON TDP LEADERS : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ మండిపడ్డారు. వైసీపీ నేతల అక్రమాలను వెలికితీస్తున్న తమ పార్టీ నేతలపై దాడులు చేయడం దారుణమని ధ్వజమెత్తారు.

LOKESH FIRES ON YCP LEADERS
LOKESH FIRES ON YCP LEADERS
author img

By

Published : Dec 5, 2022, 3:01 PM IST

LOKESH FIRES ON YCP LEADERS : వైసీపీ నేతల అక్రమాలను వెలికితీస్తున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై పోలీసుల అండతో భౌతిక దాడులకు దిగుతున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మండిపడ్డారు. గ్రావెల్, మట్టి, మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేశారనే కక్షతో చింతమనేని ప్రభాకర్ ముఖ్య అనుచరుడు శివబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి హత్యాయత్నం చేశారని ఆరోపించారు.

టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ వాళ్లని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారం అండతో ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రజావ్యతిరేకత వెల్లువలో వైసీపీ సర్కారు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. లండన్ మందులు వాడే అబ్బాయ్, లండన్ నుంచి వచ్చిన అబ్బయ్యని అక్కడికే పంపడం ఖాయమని.. లగేజీ సర్దుకోవాలని హెచ్చరించారు.

  • వైసీపీ నేతల అక్రమాలను వెలికి తీస్తున్న టిడిపి నేతలు, కార్యకర్తలపై పోలీసుల అండతో భౌతిక దాడులకు దిగుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గ్రావెల్, మట్టి, మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేశారనే కక్షతో చింతమనేని ప్రభాకర్ గారి ముఖ్య అనుచరుడు శివబాబుపై..(1/3)

    — Lokesh Nara (@naralokesh) December 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంత్రి పెద్దిరెడ్డి బీసీ నేతలను అంతమొందించే ప్రయత్నాలు: ప్రశ్నించే వాళ్ల ప్రాణాలు తీయడమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలిసిన ప్రజాస్వామ్యమా అని.. నారా లోకేశ్​ నిలదీశారు. ఓవైపు జగన్‌ జయహో బీసీ సభకు కసరత్తు చేస్తుంటే.. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి బీసీ నేతలని అంతమొందించే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పుంగనూరు పారిశ్రామికవేత్త, జనసేన నేత రామచంద్రయాదవ్ ఇంటిపై వైసీపీ మూకల దాడి క్షమార్హం కాదన్నారు. రామచంద్రయాదవ్ రైతు సదస్సు నిర్వహించాలనుకోవటం నేరమా అని నిలదీశారు. ఒక బీసీ నేతని అంతమొందించే లక్ష్యంతో మంత్రి పెద్దిరెడ్డి మనుషులే దాడికి దిగితే, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని దుయ్యబట్టారు.

  • సీఎం జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహిస్తుంటే, ఇటు పుంగనూరులో ముఖ్యమంత్రి తరువాత నెంబర్ 2 స్థానంలో వున్న మంత్రి పెద్దిరెడ్డి గారు బీసీ నేతలని అంతమొందించే కుతంత్రాలు చేస్తున్నారు.(1/3)#YSRCPRowdyism #YCPGoondas pic.twitter.com/pCzMCrLCCA

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.