లాక్డౌన్ను ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడా ఘుళిపిస్తున్నారు. అవసరం లేకపోయినా రోడ్లపైకి వస్తూ ఆంక్షలను బేఖాతరు చేసేవారి వాహనాల్ని సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. మార్చి 24 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు మొత్తం 9,498 కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1,417... నెల్లూరులో 1,144 కేసులు నమోదు చేయగా... అత్యల్పంగా విజయవాడలో 102, తూర్పుగోదావరి జిల్లాలో 117 కేసులు నమోదయ్యాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీగా జరిమానాలు విధించారు. సీజ్ చేసిన వాహనాలను లాక్డౌన్ ముగిసేవరకు ఇవ్వరు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 2,057, విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 132 వాహనాలు సీజ్ చేశారు.
కేసుల వివరాలు ఇలా...
ఐపీసీ సెక్షన్లు 188, 269, 279, 217, కింద నమోదు చేసిన కేసులు 9,498
పదేపదే వాహనాలతో రోడ్లపైకి వచ్చేవారిని గుర్తించి సీజ్ చేసిన వాహనాలు 13,956
మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 179 ప్రకారం నమోదు చేసిన కేసులు 2,41,481
నిబంధనలు ఉల్లంఘించినందుకు చలానాల ద్వారా వసూలు చేసిన మొత్తం రూ.11.21కోట్లు