ETV Bharat / state

వైసీపీ సమర్పించు 'జగనన్న బెల్టు షాపులు' - అధికారం అండతో యధేచ్చగా అమ్మకాలు

Liquor Sales in AP Under YCP Government: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో ఇబ్బడిముబ్బడిగా బెల్టు దుకాణాలు వెలిశాయి. బడి, గుడి ఉందన్న ధ్యాసే లేదు.. ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. బడ్డీకోట్లు, కిరాణా దుకాణాలు మొదలు.. పాల కేంద్రాల వరకు అన్నిచోట్ల మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఎన్నికల ముందు ఊరూరు తిరిగి బెల్టుషాపులపై నానా యాగీ చేసిన సీఎం జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేశామనే భ్రమల్లోనే ఉన్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

liquor_sales_in_ap
liquor_sales_in_ap
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 10, 2023, 7:23 AM IST

వైసీపీ సమర్పించు 'జగనన్న బెల్టు షాపులు' - అధికారం అండతో యధేచ్చగా అమ్మకాలు

Liquor Sales in AP Under YCP Government: ప్రతిపక్ష నేతగా జగన్ ఊరూరు తిరుగుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని.. బెల్టుషాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయని తెగ ఆవేదన పడిపోయారు. తాను అధికారంలోకి రాగానే.. మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని.. కేవలం ఫైవ్‌స్టార్‌ హోటల్లో మాత్రమే మద్యం దొరికేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా నాలుక మడతేశారో తెలుసుకుందాం.. పోనీ ముఖ్యమంత్రి హోదాలో చెప్పినట్లుగా అంచెలంచెలుగా ఏమైనా మద్యం దుకాణాలు తగ్గించారా అంటే అదీ లేదు.. పైవ్‌స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామన్న మాటమరిచిన జగన్‌.. నేరుగా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు సాగించేలా దుకాణాలు తెరిచారు.

మద్యం డబ్బులు 'జె' ట్రెజరీకి, ఇసుక దోపిడీ సొమ్ము 'పీ' ట్రెజరీకి - రాష్ట్రంలో మద్యం ఆర్డీఎక్స్ కన్నా ప్రమాదకరం : పురందేశ్వరి

ఇక్కడ సరఫరాకు, అమ్మకాలకు లెక్కలు ఉండవ్‌.. బెల్టు దుకాణాలే కాదు, మద్యం దుకాణాలు ఎత్తివేసిన తర్వాతే జనాన్ని ఓట్లు అడుగుతానంటూ సీఎంగా ఎన్నికైన తొలినాళ్లలో జగన్ పదేపదే చెప్పేవారు.. మరో 6 నెలల్లో ఎన్నికలు రానున్నాయి.. అంటే రాష్ట్రంలో ఎక్కడా మద్యం దుకాణాలు లేనట్లేనా.. గ్రామాల్లో ఒక్క బెల్టుషాపు కూడా లేనట్లేనా.. జనాలకు ఇచ్చిన హామీలన్నీ వందశాతం నెరవేర్చానన్న భ్రమల్లో ఉన్న సీఎం జగన్‌.. బెల్టుషాపులను సైతం పూర్తిగా ఎత్తివేశాననే కోవలోనే ఉన్నారు.

అందుకే వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో.. గ్రామాల్లో బెల్టుషాపుల వ్యాపారం మూడు సీసాలు, ఆరు పెగ్గులుగా సాగుతోంది. చిల్లర దుకాణాలు మొదలు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలు, బడ్డీకొట్లు, కూల్‌డ్రింక్‌ షాపులు, కిరాణా కొట్ల మాటున విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి ఊళ్లో వీటి నిర్వహణలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులదే కీలక పాత్ర.

Health problems Due to Poor Quality Alcohol in AP: వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన మద్యం.. నాలుగేళ్లుగా గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు

రాష్ట్రంలో ప్రతి 700 మందికి ఒక బెల్టు దుకాణం ఉంది. బడి, గుడి ఉందన్న ఆలోచనే లేదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. చిన్న చిన్న గ్రామాల్లో కనీసం రెండు, మూడు బెల్టుషాపులు నడుస్తున్నాయి. వీటికి ప్రభుత్వ మద్యం దుకాణం నుంచే సరఫరా అవుతోంది. ఒక్కో క్వార్టర్‌ సీసాపై అదనంగా 10 నుంచి 15 రూపాయలు చొప్పున తీసుకుని విక్రయిస్తున్నారు. బెల్టుషాపులవారు ఆ రేటుపై మరో 30 నుంచి 40 రూపాయల మేర అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టు దుకాణాలపై సెబ్‌, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.

YCP leader distributes liquor and chicken: తొందరపడి వైసీపీ కోడి ముందే కూసింది..! ఔరా.. ఇదేమి చోద్యం అంటున్న జనాలు..

District-wise Liquor Shops in AP..

  • ఉమ్మడి విశాఖ జిల్లా చోడవరం పాత బస్టాండ్‌ నుంచి చీడికాడకు వెళ్లే దారిలో రెండు కిలోమీటర్ల పరిధిలో 12 దుకాణాలున్నాయి. చోడవరం పట్టణంలో 21 వేల జనాభా ఉంటే 25 బెల్టు దుకాణాలు ఏర్పాటు చేశారు. కిళ్లీకొట్లు, కిరాణా దుకాణాలే వీటికి అడ్డాలు.
  • ఉమ్మడి అనంతపురం జిల్లా తాళ్లకెరలో ఫోన్‌ చేస్తే చాలు.. ఎక్కడికైనా మందుసీసాలు సరఫరా చేస్తున్నారు. 3 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో 5 బెల్టుషాపులు ఉన్నాయి. మద్యం సీసాలను కూరగాయల ట్రేలు, బియ్యం బస్తాలు, పిండి సంచుల్లో ఉంచుతున్నారు. కర్ణాటకకు చెందిన టెట్రా ప్యాకెట్ల మద్యం ఇక్కడ దొరుకుతుంది. రోజుకు సుమారు 20వేల రూపాయల విక్రయాలు జరుగుతున్నాయి.
  • ఎన్టీఆర్ జిల్లాలో పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం పెనుగంచిప్రోలులో 20వేల జనాభా ఉంటే 18 బెల్టుషాపులు నడుస్తున్నాయి. తిరుపతమ్మ ఆలయం, సత్రాలకు సమీపంలోనే రెండు దుకాణాలు ఉన్నాయి. సగటున రోజుకు 100 సీసాల మద్యం విక్రయిస్తున్నారు. ఇక్కడికి తెలంగాణ మద్యమూ సరఫరా అవుతోంది.
  • ఉమ్మడి కర్నూలు జిల్లా వెల్దుర్తిలో దుకాణాల్లో దొంగచాటుగా మద్యం అమ్మక్కర్లేదు. ఇక్కడి ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసేశాక బైక్‌లపై వచ్చి దర్జాగా రోడ్డుపైనే అమ్మేస్తున్నారు. మరో రెండు బెల్టుషాపులు ఉన్నాయి. వీరంతా అధికార పార్టీ నాయకుల అండదండలంతో ఒక్కొక్కరూ రోజుకు 10 వేలకు తక్కువ కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు.
  • ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరులో 40 వేల జనాభాకు 100 బెల్టుషాపులు ఉన్నాయి. ఇక్కడ కొన్నిచోట్ల మద్యం అమ్మకాల కోసమే కిరాణా దుకాణాలు వెలిశాయి. ఒక్కో బెల్టుషాపులో రోజుకు సగటున 50 నుంచి 60 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. ఎంతలేదన్నా రోజుకు ఇక్కడ 60 లక్షల వ్యాపారం జరుగుతున్నట్టే. వైసీపీ ద్వితీయశ్రేణి నేతలు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు.
  • ఉమ్మడి విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 30 వేల జనాభాకు 40 బెల్టుషాపులు ఉన్నాయి.
  • ఉమ్మడి గుంటూరు జిల్లా శింగరకొండపాలెంలో 5 బెల్టుషాపులు ఉన్నాయి.
  • ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సూర్యారావుపేటలో ఇళ్ల మధ్యనే 6 బెల్టుషాపులు నడిపిస్తున్నారు.
  • ఉమ్మడి చిత్తూరు జిల్లా నెలబల్లిలో ఒక బెల్టుషాపును వాలంటీరు, మరోదాన్ని స్థానిక వైసీపీ నేత నిర్వహిస్తున్నారు.
  • ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దీన్‌పురంలో 560 ఇళ్లకు 5 బెల్టుషాపులు ఉన్నాయి. ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా మాచవరంలో 6 బెల్టుషాపులు ఉన్నాయి. ఏ అధికారీ అటువైపు కన్నెత్తి చూడరు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.