గుంటూరులో బాపూజీ మహాత్మాగాంధీ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హిమని సెంటర్లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మధ్య విమోచన రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీజీ విగ్రహం వద్ద కళాకారులు నిర్వహించిన నృత్యాలు, దేశభక్తి గీతాలు ప్రత్యక ఆకర్షణగా నిలిచాయి.
బాపూజీ అహింసా వాది..
గాంధీజీ అహింసా వాది అని.. దేశ యువతను, ప్రజలను అత్యంత ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కొనియాడారు. గత కొన్నేళ్లుగా గాంధీ భావాలను ప్రచారం చేస్తున్నామన్నారు.
విస్త్రృతంగా తీసుకెళ్తున్నాం..
151వ జయంతి సందర్భంగా ఆయన భావాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతున్నామన్నారు. దేశంలో ప్రార్థన మందిరాలు, ఎస్సీలపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మత సామరస్యం ఉండాలని గాంధీజీ ఆకాంక్షించినట్లు గుర్తు చేశారు. గాంధీజీ సందేశాలను, అయన ఆశయాలను ప్రజలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపౌరుడుపైన ఉందన్నారు.