గుంటూరు శంకర్ విలాస్ కూడలి వద్ద వామపక్ష నేతలు నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలంటూ.. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక.. పేద ప్రజలపై ధరల పెంపుతో దోపిడీ చేస్తోందని సీపీఎం నగర కార్యదర్శి నళినికాంత్ ఆరోపించారు.
ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్న మోదీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ వారు నినాదాలు చేశారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమబాట పడుతామని సీపీఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి హెచ్చరించారు.
ఇదీ చదవండి: