అప్పుల బాధ తాళలేక ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన... గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని కొత్తూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొర్ర బాలు నాయక్‌కు ఐదెకరాల సొంత పొలం ఉంది. దానికి తోడు ఏడెకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పంట నష్టం వాటిల్లి అప్పులు పెరగడంతో రాత్రి సమయంలో తన పొలంలో పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో బాలు నాయక్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగామధ్యలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:
రాజధానిగా అమరావతివైపే ప్రజల మొగ్గు... వెబ్‌సైట్ పోలింగ్‌లో 93 శాతం మంది ఓటు